తిరుపతికి వస్తూ తిరిగిరాని లోకాలకు....

గురువారం, 7 డిశెంబరు 2017 (09:41 IST)
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం అర్థరాత్రి జరిగింది. తిరుచ్చి జిల్లా తువరన్‌కురిచ్చి దగ్గర జాతీయ రహదారిపై బోర్‌వెల్‌ వాహనాన్ని.. వ్యాన్‌ ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాగర్‌కోయిల్‌ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోర్‌వెల్‌ వాహనాన్ని డ్రైవర్‌ ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో వెనుక వస్తున్న వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ప్రమాదంలో వ్యాన్‌ నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కన్యాకుమారికి చెందిన ఒకే కుటుంబం వారిగా గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు