మోదీకి నిస్సాన్ నోటీసులు.. రూ.5వేల కోట్లు చెల్లించలేదు..

శనివారం, 2 డిశెంబరు 2017 (13:20 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ నిస్సాన్ షాక్ ఇచ్చింది. భారత సర్కారు తమ సంస్థకు రూ.5వేల కోట్లు బకాయిపడిందని.. మోదీకి లీగల్ నోటీస్ పంపింది. భారత్‌లో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసే సమయంలో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పినా.. ఆ హామీని ఉల్లంఘించిన కారణంగా నిస్సాన్ సంస్థ నోటీసు పంపింది.
 
తమిళనాడులో 2008లో నిస్సాన్ తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో పలు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తమిళనాడు సర్కారు ప్రకటించింది. అయితే ప్రభుత్వంతో కుదుర్చుకున్న నిస్సాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని సర్కారు తుంగలో తొక్కింది. దీంతో బకాయి ప్రోత్సాహకాలను ఇప్పించాల్సిందిగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 
 
 కానీ సర్కారు స్పందించకపోవడంతో 2016లో నిస్సాన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే ప్రధాని కూడా స్పందించకపోవడంతో గత ఏడాది జూలైలో ప్రధానికి నిస్సాన్ నోటీసులు పంపింది. బకాయిలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన పేర్కొంది. అయితే నిస్సాన్ కోర్టులో కేసు పెట్టింది. ఈ కేసు విచారణ డిసెంబర్ రెండో వారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు