ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి ప్రతి రోజూ ప్రశ్నపత్రం లీక్ అవుతుంది. అలాగే, పరీక్షా హాలులో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే, టెన్త్ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ కావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ వారేనంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
గురువారం తిరుపతి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మూడేళ్లలో మా ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తే చంద్రబాబు సిండికేట్‌కు కడుపుమంటగా ఉంది. టెన్త్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వెనుక చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తికి చెందిన స్కూళ్లు ఉన్నాయి. రెండు నారాయణ స్కూళ్లు, మూడు చైతన్య స్కూళ్లలో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి అని ఆరోపించారు.
విజయవాడ, గుంటూరు, విశాఖల్లో అత్యాచారాలు జరిగాయని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. యాగీ చేస్తున్నారు. అయితే... నిందితులంతా టీడీపీకి చెందిన వారే అని తేల్చేశారు. తిరుపతి వేదికగా వెంకటేశ్వరస్వామిని వేడుకోవాల్సి వస్తోంది! దేవుడా... నా రాష్ట్రాన్ని దుష్టచతుష్టయం నుంచి రక్షించు అంటూ ఏడుకొండల వాడిని క్రైస్తవ మత నియమాలను పాటించే సీఎం జగన్ తలచుకున్నారు.