గుంటూరు జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికను ఆ రొంపి దింపి..?

శనివారం, 18 డిశెంబరు 2021 (13:43 IST)
గుంటూరు జిల్లాలో బాలికపై దారుణం చోటుచేసుకుంది. 13ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పల్నాడులో భార్య, 13 ఏళ్ల కూతురికి 7 నెలల కిందట కరోనా సోకింది. 
 
వారిని బాలిక తండ్రి జీజీహెచ్‌లో చేర్చించగా.. భార్య చికిత్స పొందుతూ చనిపోయింది. అదే సమయంలో బాలికకు తండ్రి తప్ప ఎవరూ లేరని తెలుసుకున్న స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ.. తాను ఓ నర్సునని బాలిక తండ్రిని నమ్మించింది.
 
బాలికకు నాటు వైద్యం చేస్తే.. కరనా తగ్గిపోతుందని నమ్మించి.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లింది. కొద్ది రోజుల తర్వాత వ్యభిచారం చేయాలని ఒత్తిడికి గురి చేసింది. ఇష్టం లేదని చెప్పినా.. కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉంచుకుని ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. నెల్లూరు, విజయవాడ, ఒంగోలుకు తీసుకెళ్లి బాలికతో వ్యభిచారం చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణ తెలిసింది.
 
కాగా కొన్ని రోజుల కింద బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాలికను నిర్వహకురాలు విజయవాడలో వదిలేసిందని, ఆ తర్వాత బాలిక తన ఇంటికి చేరిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు