ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు: మేకపాటి

బుధవారం, 28 జులై 2021 (03:25 IST)
ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.

త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021ను అమలులోకి తేనున్నట్లు వెల్లడించారు. లాజిస్టిక్ పాలసీ -2021 పై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ ఉంటుందన్నారు. మౌలిక సదుపాయలకు పెద్దపీట వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రి మేకపాటి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు