కాపు మహిళల ఖాతాల్లో రూ.353.81 కోట్లు జమ: కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్

గురువారం, 25 జూన్ 2020 (14:05 IST)
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొందని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు. తాడేపల్లిలో ఉన్న వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో  మాట్లాడారు.

ఇవాళ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాపు నేస్తం ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాపు సామాజిక వర్గానికి సీఎం నేను ఉన్నాననే ధైర్యాన్ని, భరోసాను కల్పిస్తూ కాపు మహిళలకు రూ.15,000 వారి ఖాతాల్లో నగదు జమ చేశారన్నారు. రాబోయే ఐదేళ్లలో కాపు మహిళలకు రూ.75,000 ఆర్థికసాయం అందించే కాపు నేస్తం పథకానికి సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,35,873 మంది కాపు మహిళలు ఎవరైతే 45 ఏళ్లు పైబడి, 60 ఏళ్లు లోపు వారికి ఒక్కొక్కరికి ప్రతి ఏటా రూ.15,000లు అందించటం జరుగుతుందని జక్కంపూడి రాజా వివరించారు. 
 
'కాపులను బీసీల్లో  చేరుస్తామని చెప్పి చంద్రబాబు దగా చేశారు. ఎన్నికలప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చి కాపుల్ని చంద్రబాబు నట్టేట ముంచాడు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అనేక రకాల వాగ్ధానాలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దొరికింది దొరికినట్లు దోచుకోవటమే లక్ష్యంగా పాలన సాగిందని' జక్కంపూడి రాజా విమర్శించారు.

కాపులకు ఇచ్చిన వాగ్ధానాలు చంద్రబాబు నెరవేర్చకపోగా ఐదేళ్లలో కాపులపై కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని జక్కంపూడి రాజా గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి రూ.1,000 కోట్లు చొప్పన ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కనీసం రూ.400 కోట్లు కూడా ఖర్చు చేయలేదని రాజా మండిపడ్డారు.

కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు వాగ్ధానం ఇచ్చి పూర్తిగా గాలికి వదిలేస్తే.. ఇచ్చిన మాటలు నెరవేర్చమని ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తే వారిపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పారు. 
 
10 సంక్షేమ పథకాల ద్వారా కాపులకు రూ.4,415 కోట్లు అందించాం:
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఏదైతే చేస్తామని చెప్పారో.. చెప్పిన దానికన్నా మిన్నగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని చెప్పటానికి గర్వపడుతున్నామని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు.

దాదాపుగా 10 సంక్షేమ పథకాల ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.4,415 కోట్లు కాపు కార్పొరేషన్ తరుపున కాపు కుటుంబీలకు ఆదుకోవటం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు కాపు పెద్దల ఇంటి మహిళలను పోలీసులతో అత్యంత దారుణంగా వ్యవహరించారు. చెప్పుకోలేని బూతు మాటలు తిట్టి కాపు మహిళలను ఆత్మక్షోభకు గురిచేశారని జక్కంపూడి రాజా గుర్తు చేశారు. 
 
దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు: 
కాపుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం వైయస్ జగన్ ఇవాళ సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి నేరుగా లబ్దిదారుల అకౌంట్లకు నగదు వెళ్లేలా చేశారు. పాత అకౌంట్లలో అప్పు ఉన్నా కేవలం లబ్ధిదారులు వాడుకునేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. దీనిపై లబ్ధిదారులు పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మహిళలు ఫోన్లు చేస్తున్నారని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్ జక్కంపూడి రాజా పేర్కొన్నారు.

ఇన్ని దశాబ్దాల పాటు కాపు సామాజిక వర్గాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వాలను, సీఎంలను చూశాం కానీ, కాపుల అభివృద్ధి కోసం, బాగుల కోసం కృషి చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్ మోహన్ రెడ్డిని మహిళలు అంతా ఆశీర్వదిస్తున్నారు. ఇచ్చిన ప్రతి మాటనూ నెరవేర్చే నాయకుడుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కీర్తి ప్రతిష్టలు వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కాపుల పట్ల ఇంత నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డికి యావత్ కాపు జాతి తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు. 
 
కాపుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం కృషి చేస్తుంది:
రాబోయే రోజుల్లో కాపులను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకువెళ్లటానికి వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టబడి ఉంటుందని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్ జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. 2,35,873 మంది లబ్దిదారుల అకౌంట్లకు రూ.353.81 కోట్లు జమ చేయటం జరిగిందని జక్కంపూడి పేర్కొన్నారు.

చంద్రబాబు కాపుల కోసం ఏనాడూ మేలు చేయలేదని వంగవీటి మోహనరంగా హత్య నాటి నుంచి ఏనాడూ కాపులకు మంచి చేసిన దాఖలాలు లేవని జక్కంపూడి అన్నారు. చంద్రబాబు, సీఎం వైయస్‌ జగన్ గారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కాపులు గమనిస్తున్నారని రాజా తెలిపారు. రాబోయే రోజుల్లో కాపులకు మరింత మేలు జరిగేలా వైయస్‌ జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్ జక్కంపూడి రాజా స్పష్టం చేశారు.

ఇవాళ ఎక్కడైనా అర్హత ఉండి నమోదు కాకపోతే గ్రామ సచివాలయాల్లో లిస్ట్‌ చూసి మళ్లీ నమోదు చేయించుకోమని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారని జక్కంపూడి అన్నారు. 
 
గతంలో జన్మభూమి కమిటీల జేబులు నింపితేనే పథకాలు:
గతంలో కాపు కార్పొరేషన్‌ ద్వారా కొంతమందికే లోన్లు ఇచ్చే కార్యక్రమాలు ఇచ్చేవారని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్ జక్కంపూడి రాజా గుర్తు చేశారు. గతంలో ఎవరైనా లోన్‌ కోసం అప్లికేషన్ పెడితే రాజ్యాంగేతర శక్తులైన జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగితే ఎవరికో టీడీపీ సభ్యత్వం తీసుకున్నావా అని అడిగి వారిని మాత్రమే సెలక్ట్ చేసేవారు.

అందులోనూ రూ.లక్ష సబ్సిడీ లోన్ సాంక్షన్ చేస్తే కేవలం రూ.50వేలు మాత్రమే సబ్సిడీ వచ్చేదని రాజా తెలిపారు. అందులోనూ జన్మభూమి కమిటీ సభ్యులు జేబులు నింపితేనే లోన్లు ఇచ్చేవారని జక్కంపూడి గుర్తు చేశారు. కానీ నేడు ఎవరైనా సాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకొని కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఈ నాలుగు కాపు సామాజిక వర్గానికి చెందిన అందరికీ మేలు చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తోందని జక్కంపూడి రాజా తెలిపారు.

నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకే నగదు బదిలీ జరిగేలా కాపు నేస్తం పథకం రూపొందించటం జరిగిందని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మేలు కాపు కుటుంబీకులకు జరుగుతుందని జక్కంపూడి రాజా తెలిపారు. కాపు మహిళల్లో ఆత్మస్థైర్యం, భరోసా కల్పించేలా కాపు నేస్తం కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేశారన్నారు. దీనిద్వారా చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి నిలిచిపోతారని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు