అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఉన్న ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా నలుగురు చిన్నారులు మృతి చెందారు. మంగళవారం సమోసాలు తిన్న తర్వాత 24మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
వారిని అనకాపల్లి, నర్సీపట్నంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. జాషువా (1వ తరగతి), భవాని, శ్రద్ధ (మూడో తరగతి) అనే ఈ చిన్నారుల మృతితో అనాథాశ్రమంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కాగా, ఈ అనాథాశ్రమంలో మొత్తం 60 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె.విజయ విచారణకు ఆదేశించారు.