గత 90 రోజుల కాలంలో విశాఖపట్నంలో 50%కు పైగా ఉద్యోగాలను చిరు వ్యాపార సంస్థలే సృష్టించాయి

బుధవారం, 2 నవంబరు 2022 (17:58 IST)
పలు పరిశ్రమల వ్యాప్తంగా ఉద్యోగ నియామక ప్రక్రియల పరంగా భారతదేశంలో వృద్ధి కనిపిస్తోన్నవేళ, దక్షిణ భారతదేశంలో తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోంది. నిజానికి భారతదేశంలో సుప్రసిద్ధ జాబ్స్‌, ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అప్నా డాట్‌ కో వెల్లడించే దాని ప్రకారం అత్యంత ప్రాచుర్యం పొందిన నగరాలలో విశాఖపట్నం ఒకటి కావడమే కాదు, ఉద్యోగావకాశాల పరంగా అగ్రగామి కేంద్రాలలో కూడా విశాఖపట్నం నిలిచింది. ఇక్కడ 50%కు పైగా ఉద్యోగావకాశాలను చిరు వ్యాపార సంస్ధలు సృష్టించాయి.
 
ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 5వేల మందికి పైగా ఎంప్లాయర్లకు నమ్మకమైన భాగస్వామిగా అప్నా నిలిచింది. వీరిలో 2500 మంది ఒక్క విశాఖపట్నంలోనే ఉన్నారు. విశాఖపట్నంలో అమితాదరణ పొందిన ఉద్యోగాలలో టెలికాలింగ్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, డెలివరీ పర్సన్‌, ఫీల్డ్‌ సేల్స్‌, డాటా ఎంట్రీ  ఉన్నాయి. గత 90 రోజుల కాలంలో ఉద్యోగ దరఖాస్తుల పరంగా భారీ వృద్ధి కనిపిస్తుంది. నిజానికి 1,30,000 ఉద్యోగ దరఖాస్తులను గత 90 రోజులలో పలు ఉద్యోగాల కోసం అందుకుంటే, టెలికాలింగ్‌/టెలి సేల్స్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, ఫీల్డ్‌ సేల్స్‌ ప్రధానమైన మూడు ఉద్యోగాలుగా నిలిచాయి. విశాఖపట్నంలో జ్ఞానపురం, ద్వారకా నగర్‌, మధురవాడ, గాజువాక, సిరిపురంలు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాంతాలుగా ఎంప్లాయర్లు మరియు ఉద్యోగార్ధుల మధ్య నిలిచాయి.
 
అప్నా డాట్‌ కో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మానస్‌ సింగ్‌ మాట్లాడుతూ,‘‘దక్షిణ భారతదేశంలో హైపర్‌ లోకల్‌ అవకాశాల కోసం సుప్రసిద్ధ మార్కెట్‌గా ఆంధ్రప్రదేశ్‌  నిలుస్తుంది. ప్రధాన జిల్లాల వ్యాప్తంగా చిరువ్యాపార యజమానులు అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను పోస్ట్‌ చేశారు. ఇది రాష్ట్ర వృద్ధి పరంగా సానుకూల అంశాలను వెల్లడిస్తుంది. తమ వ్యాపారాల కోసం సరైన ప్రతిభావంతులను ఎంచుకోవడంలో మేము వారికి సహాయపడనున్నాం’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు