అనంతపురంలో విషాదం... విద్యుత్ షాక్‌కు ఆరుగురు వ్యవసాయ కూలీల మృతి

బుధవారం, 2 నవంబరు 2022 (15:53 IST)
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని బొమ్మనహాల్ మండలం దుర్గా హోన్నూరులో జరిగింది. వీరంతా ట్రాక్టర్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
విద్యుత్ వైర్లు తెగిపడటంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానికంగా విషాదం చోటు నెలకొంది. సమచారం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ యేడాది జూన్ నెల 30వ తేదీన తాడిమర్రి మండలంలోని కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఆటో కూలీలు వ్యవసాయ పనులకు వెళుతుండగా, ఆటోపై విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ వైర్లను ఉడుత కొరకడంతో వైర్లు తెగిపడి ఈ ప్రమాదం జరిగిందని వైకాపా మంత్రులు, నేతలు సెలవిచ్చిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు