జ్వర పీడితుల్నిగుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వేలో భాగంగా రాష్ట్రంలో 93.85 శాతం, కృష్ణాజిల్లాలో 90.49 శాతం, విజయవాడ నగరంలో 88.97 శాతం అనగా 286 సచివాలయాల పరిదిలోని 299705 నివాసాలలో 265888 నివాసాలను సర్వే నిర్వహించుట జరిగిందని, 68573 నివాసాలు రెండు మూడు సారులు సర్వే నిర్వహించి బాధితుల్ని గుర్తించినట్లు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు.
ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే పరిక్షలు చేయించుకోవాలన్నారు. నగరంలో బ్లిచింగ్, సున్నంతో పాటు హైపొక్లొరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నామన్నారు. కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా తమ ప్రాణాలు సైతం లెక్క చెయకుండా మునిసిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు సేవలందిస్తున్నారన్నారు.