విజయవాడలో భారీగా నమోదవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

మంగళవారం, 18 మే 2021 (17:02 IST)
విజయవాడలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతి ENT హాస్పిటల్‌లో రోజులో 10 లోపు కేసులు వస్తున్నాయి. సింగరేణి హాస్పటిల్స్‌లో రోజుకి 7,8 కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ హాస్పిటల్లో లిపోసామాల్ అంఫోటేరిసిన్ బీ ఇంజక్షన్ అందుబాటులో లేవు.

దేశంలో కేవలం నాలుగు చోట్లే ఈ ఇంజక్షన్ తయారీ అవుతుంది. ఒక పెసెంట్‌కు సర్జరీ చెయ్యాలంటే 104 వైల్స్ కావాల్సి ఉంటుంది. పెసెంట్ వైట్‌ను బట్టి ఒక కేజీ వైట్‌కి ఐదు మిల్లి గ్రాముల ఇవ్వాల్సి ఉంటుంది. రెండు నుండి మూడు వారాలు వైద్యం తీసుకోవాలి.

ఆల్టర్నేటివ్‌గా జోల్ డేర్వేటివ్స్ టాబ్లెట్స్ కూడా వాడతారు. ఈ ఫంగస్‌ను ముందుగానే గుర్తిస్తే సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్స్. అయితే ఇప్పటికే ఏపీలో రోజుకు 20 వేల కరోనా కేసులు వస్తుండగా ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు