వైజాగ్ సిటీలో నివాసముంటున్న ఉమా మహేశ్వరి అనే యువతి స్థానికంగా ఉన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. తనతో పాటు పనిచేస్తున్న జాజిబాబు అనే వ్యక్తిని ప్రేమించింది. ఆరు నెలల నుంచి వీరి ప్రేమాయణం సాగుతోంది. అయితే వారం రోజుల నుంచి జాజిబాబు మరో యువతి వసుంధరతో సన్నిహితంగా ఉంటూ కనిపించాడు. ఇది కాస్త ఉమ చూసేసింది. జాజిబాబును నిలదీసింది.
అయితే పెద్దలు ఇద్దరికీ నచ్చజెప్పారు. వారంరోజులు ఉమను తమ బంధువుల ఇంటికి పంపారు తల్లిదండ్రులు. నిన్న బంధువుల ఇంట్లో ఉన్న ఉమ తన ప్రియుడి లేని జీవితం తనకు అవసరం లేదని, తను గాఢంగా జాజిబాబును ప్రేమించానని, అయితే తనను అతను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. జాజిబాబు, వసుంధరలను అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పింది ఉమ.