ఘాట్ రోడ్డులో మహిళను చంపేసిన చిరుతపులి, అటవీశాఖ మంత్రీ పవన్ కాపాడండీ (video)

ఐవీఆర్

బుధవారం, 26 జూన్ 2024 (23:07 IST)
నంద్యాల లోని గిద్దలూరులో దారుణం జరిగింది. కట్టెలు తెచ్చుకునేందుకు ఘాట్ రోడ్డుకి సమీపంలో వున్న వంక వద్దకు వెళ్లిన మెహరున్నీసా అనే మహిళపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
 
గత కొన్నిరోజులుగా తమ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఐతే చిరుత జాడ కోసం అధికారులు గాలిస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నది. కాగా మెహరున్నీసా గతంలో సర్పంచ్‌గా పనిచేసారు.

అడవి శాఖ మంత్రి గారు మమ్మల్ని కొంచం కాపాడండి pic.twitter.com/qBlOgjsbeO

— రాG రెడ్డి గారి అమ్మాయి(@Nithya_pspk) June 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు