ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వేదపండితులు అందరూ కలసి జగన్మాత కనకదుర్గమ్మకు అలంకరణ నిమిత్తం ప్రత్యేకంగా తయారుచేయించారు.
దాదాపు రూ.3 లక్షలుపైగా విలువైన కంఠాభరణాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మకు శుక్రవారం కలిసి అందజేశారు. అనంతరం వేదపండితులు బహుకరించిన కంఠాభరణాన్ని వేడుకగా వెళ్లి అమ్మవారికి అలంకరించారు.