తొలుత కొత్త కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన ఢిల్లీ వైద్యాధికారులు వెంటనే ఎపి ప్రభుత్వానికి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. బాధితురాలి ఫోను, ఆమె కుమారుడు ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో అధికారులు ఆమె పాస్‌పోర్టు ఆధారంగా అడ్రస్‌ను గుర్తించి, వెంటనే ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమెను పట్టుకునేందుకు చర్యలు చేట్టారు.
రాజమండ్రి అర్బన్ పోలీసులను, వైద్య విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఆమె ఆచూకీని వరంగల్ సమీపంలో తెలుసుకున్నారు. అక్కడి నుంచి మహిళ, ఆమె కుమారుడ్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్‌కు పంపనున్నారు.