కరోనా చికిత్స చేయించుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్ చేయొద్దని, అలాగే కలవటానికి కూడా ప్రయత్నించవద్దని ప్రజలకు ప్రకాష్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రెండో విడత కాస్తా తగ్గినప్పటికీ అనిపించినా మళ్లీ కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రజలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు.