తొమ్మిదవ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి అత్యాచారం

శనివారం, 18 జనవరి 2020 (20:00 IST)
నగరి మండలం, కెవి పురంకు చెందిన గిరిజ మదనపల్లె గురుకుల పాఠశాలలో మాథ్స్ టీచర్‌గా పని చేస్తోంది. ఈమె అక్క కుమారుడు టివి నవీన్ కుమార్.. గత పదేళ్లుగా ఈమె వద్దే ఉంటున్నాడు. ప్రస్తుతం నవీన్ బి. కొత్తకోట ఏపి మోడల్ స్కూల్‌లో తెలుగు టీచర్‌గా పని చేస్తున్నాడు.

కాగా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన ఓ విద్యార్థిని బి.కొత్తకోట ఏపి మోడల్ స్కూల్లో 7వ తరగతి నుంచి చదువుతోంది. ప్రస్తుతం ఆ విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థిని నీరుగట్టువారిపల్లిలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. 
 
తెలుగు టీచర్ నవీన్ కుమార్ శుక్రవారం ఉదయం విధ్యార్థినికి ఫోన్ చేసి పిలిపించుకుని మదనపల్లె గురుకుల పాఠశాలలోని తన పిన్ని గిరిజ క్వార్టర్స్‌కు పిలుచుకుని వెళ్లాడు. విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి చేసి ఇంటికి పంపాడు. ఉదయం నుంచి ఇంట్లో లేకుండా వెళ్లిపోయిన కుమార్తెను తల్లిదండ్రులు కాస్త గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని బోరున ఏడుస్తూ చెప్పింది. దీంతో తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత విధ్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు