సెల్ ఫోన్ చూస్తుండగా పక్కనే పడిన పిడుగు, చనిపోయిన యువకుడు

ఐవీఆర్

గురువారం, 27 జూన్ 2024 (14:54 IST)
మెరుపులు మెరుస్తూ వర్షం పడుతున్నప్పుడు జాగ్రత్తగా వుండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తూనే వుంటుంది. పిడుగులు పడుతున్న సమయంలో వృక్షాలు, స్తంభాలు, మైదాన ప్రాంతాలు, ఆరుబయట వుండవద్దని సూచనలు ఇస్తుంటారు. అలాగే ఎలక్ట్రిక్ పరికరాలకు కూడా దూరంగా వుండాలని చెప్తారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో సెల్ ఫోన్లను ఉపయోగించకుండా వుండాలని సూచనలున్నాయి. ఐతే ఆ యువకుడు పిడుగులు పడుతున్న సమయంలో మొబైల్ ఫోను చూస్తున్నాడు. పక్కనే పిడుగు పడటంతో ఫోన్ పేలిపోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే... అనకాపల్లిలోని వి.మాడుగుల మండలానికి చెందిన భవానీ శంకర్ అనే యువకుడు పిడుగులు పడుతున్న సమయంలో ఓ పూరి పాకలో వున్నాడు. తన సెల్ ఫోనును చూస్తూ వున్నాడు. అకస్మాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ అతడు వున్న పూరిపాకకి పక్కనే వున్న పశువుల పాకపై పిడుగు పడింది. ఆ పిడుగు తీవ్రతకు యువకుడి చేతిలో వున్న సెల్ ఫోన్ పేలిపోయి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్దమధ్యలో అతడు మృతి చెందాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు