తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల మొదటి కనుమదారిలో.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి చేరుకునేందుకు మరో మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా.. జరిగిన ఈ దుర్ఘటన లో శివలింగం అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.