ప్రత్యేక హోదా కోసం నటుడు శివాజీ వినూత్న నిరసన!

సోమవారం, 13 ఏప్రియల్ 2015 (10:26 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ సినీ నటుడు శివాజీ సోమవారం వినూత్న నిరసనకు దిగారు. ఆయన కృష్ణానది నీటిలో దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద కృష్ణా నదిలో నీటిలోకి దిగారు. రాష్ట్ర విభజనతో సగం మునిగి ఉన్న తమను ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసి నిలువునా ముంచొద్దని అన్నారు. 'మాట తప్పొద్దు... ఏపీని ముంచొద్దు' అని రాసిన ప్లకార్డును ఆయన పట్టుకున్నారు. శివాజీని చూసేందుకు అభిమానులు రావడంతో, ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 
 
కాగా, బీజీపీకి చెందిన ఈ యువ నటుడు గత కొంతకాలంగా విభజన చట్టంలోని హామీలను తు.చ తప్పకుండా పాటించాలని కోరుతూ వివిధ రకాలుగా నిరసన చర్యలకు దిగుతున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి