తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసం వద్ద ధర్నాలు పెరిగి పోతుండడంతో పోలీసులు బేజారెత్తిపోతున్నారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఆఖరి అస్త్రంగా గుంటూరు రూరల్ మొత్తం ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి గారి నివాసం వద్ద చౌకధరల దుకాణ దారులు (రేషన్ షాప్ డీలర్స్) తమ కోర్కెల కోసము నిరసనలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తున్నట్లు గా తమ దృష్టికి వచ్చినట్లు,ఇట్టి కార్యక్రమాలు నిర్వహించుటకు వారికి సంబంధిత అధికారులు నుండి ఎలాంటి అనుమతులు పొందలేదు.
తగిన అనుమతులు లేకుండా ధర్నాలు వగైరా నిరసన కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టప్రకారం కేసులు నమోదుచేసి, కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందని, కనుక చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు ఎవరు హాజరు కావడం గానీ మద్దతు తెలపడం చేయరాదని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలియ జేసినారు.