విజయవాడ నగరంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు. వైష్ణవ ఆలయాల్లో ఉదయం 5 గంటలు నుండి భక్తులుకు ఉత్తర ద్వార దర్సనం ఏర్పాటు చేశారు. కానీ, తెల్లవారుజాము 3 నుంచే అంతా బారులు తీరి వెంకటేశ్వరుని దర్శనం కోసం, శివకేశవుల అనుగ్రహం కోసం వేచి ఉన్నారు.
ఉదయం 4 గంటలు నుండే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో స్వామి వారికి విశేష పూజలు, అలంకరణలు చేశారు. ఉత్తర ద్వార దర్సనం కోసం క్యూలైన్లు లో భారీగా వేచి ఉంటున్న భక్తులు హరి నామ స్మరణలో మునిగిపోయారు. భక్తులు కోసం అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు, కోవిడ్ నిబంధనలు అమలు చేయడంలో విఫలం అయ్యారు. కోవిడ్ నిబంధనలు ఉన్న ఆలయాల్లో ఎక్కడా తగ్గని భక్తులు తాకిడికి ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.