ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పినా.. చంద్రబాబు మాత్రం పోరాడి సాధించుకుంటామని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. అయినా కేంద్రంతో పోరాడే దమ్ము ఆయనకు లేదని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. సీఎం మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉందని విమర్శించారు.