శ్రీశైలానికి హోం మంత్రి అమిత్ షా రాకలోని అంతర్యమేమి?

గురువారం, 12 ఆగస్టు 2021 (08:56 IST)
శ్రీ మల్లిఖార్జున స్వామి దర్శనం కోసం కేంద్రం హోం మంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంకు వస్తున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రాయానికి అమిత్ షా ఫ్యామిలీ చేరుకుంటుంది. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి హెలికాప్టరులో శ్రీశైలంకు వెళ్లి శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్యలో అమిత్ షా కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు. 
 
స్వామి దర్శనం అనంతరం శ్రీశైలంలోని గెస్ట్ హౌస్‌లో ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం హెలికాప్టరులో బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ఆయన చేరుకోనున్నారు. 
 
అక్కడ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే, అమిత్ షా పర్యటనలో రాజకీయపరమైన ఎలాంటి కార్యక్రమాలు లేవని తెలుస్తోంది. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు