ఈ నేపథ్యంలో ఆయన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయన్నారు. అదేసమయంలో బీసీలపై రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు.
ఇకపోతే, కరోనా కష్టకాలంలో అనేక మంది రోగుల ప్రాణాలు కాపాడిన ఆనందయ్య.. ఇపుడు థర్డ్ వేవ్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మూడో దశ ఉత్పన్నమైనప్పటికీ దానికి సరైన మందు తన వద్ద ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మాత్ర ఆ మందును ప్రజలందరికీ పంపిణీ చేస్తానని తెలిపారు.