పీఛే ‘మూడ్’ - ఆంధ్రావాలా.... ఛలో హైదరాబాద్!

శనివారం, 21 డిశెంబరు 2019 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు మళ్లీ వలసలు పెరుగుతున్నాయి. ఈ వలసదారుల్లో ఉద్యోగులు, బిల్డర్లు, వ్యాపారులే ఎక్కువగా ఉన్నారు. బెజవాడలో పనిలేక తెలంగాణాకు వెళుతున్నట్టు గ్యాస్ వినియోగ గణాంకాల్లో తేలింది. ఆంధ్రాపై భ్రమలు తొలగిపోతుండటంతో ఈ వలసలు పెరిగినట్టు తెలుస్తోంది. 
 
గత మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌‌కు వలస వచ్చిన కుటుంబాల సంఖ్య కనీసం లక్ష అన్నది ఒక అంచనా. హైదరాబాద్‌ నగంలో కొత్తగా వంట గ్యాస్ కనెక్షన్ల మార్పు ద్వారా దీనిని నిర్ధారిస్తున్నారు. ఈ తరహా ట్రాన్స్‌ఫర్లు పెట్టుకున్న వారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే ఎక్కువ. ఇక వంట గ్యాసు కనెక్షన్లు లేని వారు మరో రెండు లక్షల మంది ఉన్నట్లు మరో అంచనా. 
 
ఏతావాతా దాదాపు నాలుగు లక్షల మంది ఆంధ్రా వాళ్లు తిరిగి హైదరాబాద్‌‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. ఏపీలోని సామాజిక పరిస్థితుల వల్ల, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆరు నెలల పాటు ఉక్కిరిబిక్కిరయిన ఆంధ్రోడు దిక్కు లేక, ఏపీలో తెరవు లేదన్న నిర్ధారణతో, దశాబ్దాల పాటు తనను కడుపులో దాచుకున్న తెలంగాణాకు తరలిపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు