ఇప్పుడు ఏ అగ్రహీరో సినిమా విడుదలయినా వెంటనే వారంరోజులపాటు టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. అందుకు ప్రభుత్వంతో చర్చలు జరిపిన సందర్భాలున్నాయి. ఆర్.ఆర్.ఆర్. సినిమా తర్వాత తెలుగులో వస్తున్న భారీ సినిమా ఆచార్య. దీనికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఆచార్య సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. టికెట్ల విషయమై చిరంజీవిని ప్రశ్నిస్తే, ఆయన ఆసక్లికరంగా సమాధానం ఇచ్చారు. చివర్లో దర్శకుడు కొరటాల కూడా మాట్లాడారు.