పాల డైయిరీ ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్

శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:50 IST)
చిత్తూరు జిల్లాలో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న హాట్సన్ పాల డెయిరీ యూనిట్‌లో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 20 మందికి కార్మికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
 
సాధారణంగా ఫ్యాక్టరీకి వచ్చే పాలను కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచుతారు. ఇందుకోసం అమ్మోనియం వాయును ఉపయోగిస్తుంటారు. ఈ గ్యాస్ ప్రమాదవశాత్తు లీక్ కావడంతో ఈ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన కార్మికులను చిత్తూరు, గుడిపాల ఆసుపత్రులకు తరలించారు. 
 
అస్వస్థతకు గురైన వారిలో 14 మంది మహిళా కార్మికులు ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ భరత్ గుప్తా డెయిరీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు