అమరావతి రాజధాని కోసమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తాబేదారులైన అధికారులు దళితులను బెదిరించి అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు.
అధికారులు దబాయించి దళిత రైతుల భూముల్ని బినామీల పేరిట రాయించుకున్నట్లు సంతకాలు కూడా తీసుకున్నారని వీడియో సాక్ష్యాలను ప్రదర్శించారు. అయితే, అవన్నీ ఫేక్ వీడియో సాక్ష్యాలని అమరావతి రాజధాని పరిరక్షణ సమితి నాయకులు ఖండిస్తున్నారు.