హిజ్రాలకు ప్రత్యేక పాలసీ తెచ్చిన ఏపీ సర్కారు

ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (14:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిజ్రాల కోసం ప్రత్యేకంగా ఒక విధానాన్ని (పాలసీ) రూపొందించింది. ఆ కొత్త పాలసీలో భాగంగా రాష్ట్రంలోని హిజ్రాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీచేయనుంది. అలాగే, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి వార్షిక బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.2 కోట్ల నిధులను కేటాయించనుంది. 
 
ఈ పాలసీలో భాగంగా హిజ్రాలకు మంచి వైద్య, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది. వారికి సామాజిక భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని అమలు చేయనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల ద్వారా హిజ్రాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుంది. 
 
వారికి ప్రత్యేకంగా మరికొన్ని చర్యలు చేపట్టింది. వాళ్లు నివసించే ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలను కల్పిస్తుంది. అలాగే, ప్రతిభ కలిగిన ట్రాన్స్‌జెండర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు