మదనపల్లె, ఒంగోలు, విజయవాడలలో క్రోమా స్టోర్లు ప్రారంభం

గురువారం, 13 ఏప్రియల్ 2023 (21:15 IST)
భారతదేశపు మొట్టమొదటి, టాటా గ్రూప్‌కు చెందిన, ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్‌ ఎలక్ట్రానిక్స్ రిటైలర్‌ క్రోమా, ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ మదనపల్లె, ఒంగోలులలో తమ మొదటి స్టోర్‌లతో పాటుగా విజయవాడలో తమ 11వ స్టోర్‌ను ప్రారంభించింది. నగరంలో మొట్టమొదటి జాతీయ స్ధాయి లార్జ్‌ ఫార్మాట్‌ స్పెషలిస్ట్‌ ఓమ్నీ ఛానెల్‌ ఎలక్ట్రానిక్స్ రిటైలర్‌గా నిలిచిన క్రోమా, 550కు పైగా బ్రాండ్ల వ్యాప్తంగా 16వేలకు పైగా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ఆర్ధిక వ్యవస్థ, వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి ఉంటుంది.
 
ఈ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అత్యంత కీలకంగా ఫార్మాస్యూటికల్స్‌, ఆటోమొబైల్స్‌, టెక్స్‌టైల్స్‌ మొదలైనవి ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ  కేంద్రంగా కూడా నిలుస్తుంది. ఈ రాష్ట్రంలో చక్కగా అభివృద్ధి చేసిన సామాజిక, పారిశ్రామిక మౌలిక వసతులు ఉండటంతో పాటుగా చక్కటి వర్ట్యువల్‌ కనెక్టివిటీ కూడా ఉంది. ఈ రాష్ట్రంలో చక్కటి విద్యుత్‌, ఎయిర్‌పోర్ట్‌, ఐటీ, పోర్ట్‌ మౌలికవసతులు ఉండటం చేత అత్యుత్తమ, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ కోరుకునే వారికి అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రంగా నిలుస్తుంది.
 
క్రోమా విజయవాడ-ఎనికెపాడు స్టోర్‌ 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక లెవల్‌లో ఉండగా, క్రోమా మదనపల్లె  9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్థులలో ఉండగా, క్రోమా ఒంగోలు స్టోర్‌ 10,242 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్ధులలో ఉంది. ఇక్కడ వినియోగదారులు అత్యున్నత అనుభవం, నైపుణ్యం కలిగిన క్రోమా ఎక్స్‌పర్ట్స్‌ నుంచి కొనుగోలు సమయంలో అవసరమైన సహాయాన్ని పొందగలరు. ఈ స్టోర్‌లలో వినియోగదారులు తాజా శ్రేణి ఉత్పత్తులను అన్వేషించవచ్చు. వీటిలో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్‌ ఉపకరణాలు, కూలింగ్‌ సొల్యూషన్స్‌, గృహోపకరణాలతో పాటుగా ఆడియో మరియు సంబంధిత యాక్ససరీలు ఉంటాయి.  క్రోమా యొక్క కొనుగోలు అనంతర సేవలను సైతం వీరు పొందడంతో పాటుగా నైపుణ్యంతో కూడిన సలహాలను సైతం పొందవచ్చు . అలాగే తమ కొనుగోళ్లకు సంబంధించి అత్యన్నత అనుభవాలను పొందేందుకు  షెడ్యూల్డ్‌ అభ్యాస కార్యక్రమాలలో సైతం వీరు పాల్గొనవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు