మళ్లీ బాదుడే.. బాదుడు.. : ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రూ.3,763.33 కోట్లు

శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (09:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను ఆదాయ సేకరణకు సంబంధించిన భారీ లక్ష్యాలతో ముందడుగు వేస్తుంది. ఈ యేడాది భారీ మొత్తంలో పన్ను వసూళ్లను రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాత బకాయిలతో కలిసి 2023-24 సంవత్సరానికిగాను రూ.3,763.33 కోట్ల ఆదాయ సేకరణ లక్ష్యాన్ని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మొత్తంలో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.1970.96 కోట్లు వసూలు చేయాలని నగర, పురపాలక, నగర పంచాయతీల వారీగా లక్ష్యాలను నిర్ధేశించింది. ఈ వివరాలను పురపాలక శాఖ వెబ్‌సైట్ డ్యాష్‌బోర్డులో అధికారులు గురువారం ఉంచారు. 
 
అయితే, కొత్త ఆర్థిక సంవత్సరంలో పెంచిన ఆస్తి పన్ను  వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టకుండా పురపాలక శాఖ గోప్యతను పాటిస్తూ వచ్చింది. దీనిపై పలు పత్రికల్లో మీడియా కథనాలు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించారు. మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధింపు విధానం అమలులోకి వచ్చాక పుర, నగరపాలక సంస్థలు, పంచాయతీలు ఆస్తి పన్నును ఏటా 10 నుంచి 15 శాతం మేరకు పెంచుతున్న విషయం తెల్సిందే. కాగా, గత యేడాది పాత బకాయిలతో కలిపి రూ.2,007.39 కోట్లను వసూలు చేశారు. పన్ను చెల్లించేంతవరకు ప్రజలను పట్టి పీడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు