విశాఖలో సుందరీకరణ, రోడ్లు, ఇతర చిన్నచిన్న అభివృద్ధి పనులు చేపడితే ఐదేళ్లలో హైదరాబాద్‌తో పోటీ పడే పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవాలను గుర్తించి రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాకపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపియల్ పెట్టాలని.. అమరావతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చందుకు శాసన రాజధాని ఏర్పాటు చేయాలని.. కర్నూలు ప్రజల త్యాగాన్ని, ఆకాంక్షలను గుర్తించి న్యాయ రాజధాని ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే తపనతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు.