ఇల్లు, ఆఫీసుకు ఆస్తి పన్ను: సీఎం జగన్ ఫైన్ కట్టారా?

శనివారం, 3 జులై 2021 (16:16 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన ఇంటి, కార్యాలయ ఇంటి పన్నును ఫైన్‌తో సహా చెల్లించారు. జగన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి, నివాసానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించారు.
 
కార్యాలయం డోర్‌ నంబరు 12-353/2/2 పార్సివిల్లే 47, ఆంధ్రరత్న కట్ట, రెవెన్యూ వార్డు నంబరు 12, తాడేపల్లి – 522501 అని ఉంది. ఇదే ప్రాంగణంలో మొత్తం 219 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నివాస భవనం కూడా ఉంది. దీని డోర్‌ నంబర్‌ 12-353/2/5. దీనిని జీ+2 గా నిర్మించారు. ఈ రెండు భవనాలు ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి రెడ్డి పేరిట ఉన్నాయి. 
 
వార్షిక రెంటల్‌ విలువను ఆఫీసుకు రూ. 13,64,131గా, ఇంటికి రూ.79,524 చూపించి ఆస్తి పన్ను నిర్ణయించారు. దీని ప్రకారం.. ఆఫీసుకు ఏటా రూ.4,41,980... ఇంటికి 19,752 చొప్పున పన్ను బకాయిలున్నాయి. మునిసిపల్‌శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారమే కార్యాలయంపై రూ.13,25,940 పన్ను బాకీ పడ్డారు. 
 
ఇంటికి సంబంధించి 59,256 పన్ను బకాయి ఉంది. ఆఫీస్ భవనానికి అసలు 13,25,940, పెనాల్టీ 2,93,709 కలిపి మొత్తం 16,19,649, నివాస భవనానికి అసలు పన్ను 59,256, పెనాల్టీ 11,484 కలిపి రూ.70,740 చెల్లించాల్సి ఉంది. రెండు భవానలకి కలిపి 16,90,389 చెల్లించాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు