వీడని వైఎస్ వివేకా హత్యకేసు మిస్టరీ.. తెరపైకి కొత్త పేర్లు?!

శుక్రవారం, 2 జులై 2021 (22:27 IST)
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడడం లేదు. గతంలో కంటే సీబీఐ ఈ సారి దూకుడు పెంచి విచారణ చేస్తోంది. గడిచిన 25 రోజులుగా కడప, పులివెందుల కేంద్రాలుగా సీబీఐ బృందం ముమ్మరంగా విచారణ చేస్తోంది.

మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ తుల్లాలను ఇప్పటికే పలుసార్లు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోగా కొత్తగా ఒక కుటుంబం తెర మీదకు వచ్చింది. 
 
పులివెందులకి చెందిన కృష్ణయ్య యాదవ్ కుటుంబాన్ని మొత్తం సీబీఐ గత కొన్ని రోజులుగా పదే పదే విచారిస్తూ ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ కుటుంబ సభ్యులనే పదే పదే విచారించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అసలు వివేకానంద రెడ్డి హత్య కేసులో కృష్ణయ్య యాదవ్ కుటుంబం పాత్ర ఏంటి? అసలు వివేకాకి, కృష్ణయ్య యాదవ్ కుటుంబానికి పరిచయం ఏంటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేస్ లో సీబీఐ ఈసారి కొత్త కోణంలో విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు