ఏపీలో కరోనా ఉద్ధృతి... 114 మంది మృతి..

గురువారం, 20 మే 2021 (18:40 IST)
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,01,281 కరోనా టెస్టులు చేయగా, 22,610 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,21,142కి చేరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా ధాటికి 114మంది చనిపోయారు. దీనితో మరణాల సంఖ్య 9,800కి పెరిగింది. 
 
మరోవైపు 23,098 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,134 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,83,42,918 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు