ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు: మార్చిలో నోటిఫికేషన్ విడుదల

శనివారం, 28 అక్టోబరు 2023 (10:50 IST)
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధం అయ్యింది. వచ్చే ఏడాది ఆరంభంలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఆగస్టులో ప్రారంభించిన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. 
 
ఇందులో  భాగంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసుకుంది. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడించింది. వాటిలో అభ్యంతరాల్ని డిసెంబర్ వరకూ స్వీకరించి అనంతరం వాటిని పరిష్కరించనుంది. ఆ తర్వాత జనవరి మొదటివారంలోనే తుది ఓటర్ల జాబితాను ప్రచురించబోతోంది. 
 
ఈ జాజితా ఆధారంగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో వచ్చే ఏడాది మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తాజాగా సంకేతం ఇచ్చారు. ఈ లెక్కన మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్‌లోనే ఎన్నికలు ఉండొచ్చని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు