ఏపీ ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా..

గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:21 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 100 కోట్లు జరిమానా విధించింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సమీపంలో కృష్ణా నది వద్ద జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని వాటర్‌మ్యాన్‌ రాజేంద్రసింగ్‌, అనుమోలు గాంధీ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ వేసారు. 
 
పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని ఎన్జీటీకి కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు