ఆంధ్రప్రశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలికి మంగళంపాట పాడింది. ఈ పాలక మండలి స్థానంలో విశేష అథారిటీ(స్పెసిఫైడ్ అథారిటీ)ని నియమించింది. ఈ అథారిటీకి చైర్మన్‌గా టీటీడీ ఈవో, కన్వీనర్‌గా అదనపు ఈవో ఉంటారని తెలిపింది.
ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని ట్రస్టు బోర్డు కాలపరిమితి ముగియడంతో ఈ అథారిటీని నియమించినట్లు బుధవారం జారీ చేసిన జీవోలో పేర్కొంది. తదుపరి ఆదేశాల వరకూ ఈ అథారిటీ కొనసాగుతుందని, ట్రస్టు బోర్డు నిర్వర్తించే కార్యకలాపాలన్నీ ఈ అథారిటీ చేపడుతుందని వివరించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.