జూలై నెల ఆఖరులో పరీక్షలు - రోజు విడిచి రోజు : ఏపీ ప్రభుత్వం

బుధవారం, 23 జూన్ 2021 (21:41 IST)
పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ పరీక్షలను నిర్వహించేందుకే మొగ్గు చూపుతుంది. కేంద్రంతో పాటు.. దేశం యావత్తూ ఒక దారిలో నడుస్తుంటే.. తాము మాత్రం ఆ దారిలో నడవబోమని తమ చేష్టల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. 
 
తాజాగా ఇంటర్ ఫలితాలను జూలై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ వేసింది. సుప్రీంకోర్టులో ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అఫిడవిట్‌ దాఖలు చేశారు.
 
కరోనా కేసులు తగ్గుతుందన్నందున పరీక్షలను నిర్వహిస్తామని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా జూలై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.  
 
మరోవైపు, వివిధ రాష్ట్రాల బోర్డు ప‌రీక్షల రద్దు పిటీష‌న్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచార‌ణ‌ జరుగనుంది. పిటీష‌న్‌ విచారణకు రానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేసింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. 
 
పదో తరగతిలో మార్కులు కాకుండా గ్రేడ్లు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మార్కులు లెక్కించడం సరికాదని పేర్కొంది. స్కూల్ అంతర్గతంగా ఇచ్చిన మార్కులపై బోర్డులకు నియంత్రణ లేదని, అందువల్ల ఖచ్చితమైన మార్కులు ఇవ్వడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 
 
రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గదికి 15 నుంచి 18 మంది మించకుండా చూస్తామని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు