రైతు సంఘాలు, ప్రజాసంఘాలిచ్చిన పిలుపునకు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈనెల 27న భారత్‌బంద్ చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ చేపడుతున్న ఉద్యమంలో అంతా శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్కుసంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతుల ప్రయోజనాలే టీడీపీకి ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రకటించింది.