మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్కుసంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రైతుల ప్రయోజనాలే టీడీపీకి ప్రధానమన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని తమ ఎంపీలు పార్లమెంట్లోగళం విప్పారని గుర్తు చేశారు. టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు భారత్ బంద్‌కు మద్దతిచ్చాయి.