మద్యం బ్రాండ్లపై ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్ వంటి పన్నుల్లో హేతుబద్ధత తీసుకొస్తూ శనివారం రెవెన్యూ శాఖ ప్రత్యేక అదనపు కార్యదర్శి రజత్ భార్గవ్ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం మేరకు ధరలు తగ్గనున్నాయి. బీర్లపై 10 నుంచి 20 శాతం తగ్గనుంది.
స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 36 శాతం తగ్గించారు. మొత్తంగా చూసుకుంటే బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి. అలాగే వచ్చే వారంలో అన్ని రకాల విదేశీ బ్రాండ్లను మద్యం షాపుల్లో విక్రయానికి అందుబాటులో ఉంచనున్నారు.