నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధుల బటన్ నొక్కుడు ... లబ్దిదారుల ఖాతాల్లో రూ.15 వేలు జమ!!

ఠాగూర్

గురువారం, 14 మార్చి 2024 (10:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. గురువారం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అర్హులైన మహిళా లబ్దిదారుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని బటన్ నొక్కి ఈ నిధులను మహిళల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ పథకంతో రూ.45 వేల ఆర్థిక చేయూత అందించనుంది. ఈ పథకం అర్హులైన 419853 మంది మహిళల ఖాతాల్లో రూ.628.37 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 
 
45 నుంచి 60 యేళ్ల లోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి యేటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు ఏపీ సీఎఁ జగన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద, ఈబీసీ, ఓసీ మహిళలకు మేలు జరగనుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఈ పథకంతో పేద ఓసీ కుటుంబాలకు కూడా ఆర్థిక చేయూత ఇవ్వనుంది. ఈ పథకం అమలు పట్ల ఈబీసీ వర్గానికి చెందిన మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు