గీతాంజలి మృతి- ప్రతి ఎన్నికలకు ముందు నరబలి జరగాల్సిందే.. నారా లోకేష్

సెల్వి

బుధవారం, 13 మార్చి 2024 (10:46 IST)
తెనాలికి చెందిన గీతాంజలి మృతి చెందిన ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 
 
ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అసలు, సైకో జగన్ పార్టీ వైసీపీ పుట్టిందే తండ్రి శవం దగ్గర అంటూ లోకేశ్ విమర్శించారు. 
 
వైఎస్సార్ మరణంతో వైసీపీ పుట్టింది. గత ఎన్నికల వేళ బాబాయ్ శవంతో ఓట్లు పొందిందని నారా లోకేశ్ తెలిపారు. వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమైన ప్రస్తుత దశలో ఓ మహిళ శవంతో వికృత రాజకీయాలు ఆరంభించిందని నారా లోకేశ్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు