దసరా సెలవులు ప్రకటించిన ఏపీ సర్కారు

బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఈ దసరా సెలవులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఏపీ సర్కారు కూడా ఈ సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ ఉత్తర్వుల మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబరు ఆరో తేదీ వరకు స్కూల్స్‌కు దసరా సెలవులు ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే, క్రిస్టియన్, మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు మాత్రమే ఈ సెలవులు ఇచ్చింది. ఏడో తేదీన అన్ని పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం జారీచేసిన జీవోలో పేర్కొంది. 
 
తెలంగాణాలో మాత్రం ఈ నెల 26 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వగా పదో తేదీన తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా, ఈ విద్యా సంస్థలో మొత్తం 220 పనదినాలు కాగా, మొత్తం 80 రోజులు సెలవులు రానున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు