పరిపాలనలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్.. అంతా జగన్ ఎఫెక్ట్

గురువారం, 10 మార్చి 2022 (10:33 IST)
దేశంలోనే ఏపీ పరిపాలనలో అగ్రగామిగా నిలిచింది. స్కోచ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ తొలి ఐదు స్థానాల్లో నిలవకపోవడం గమనార్హం. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో రాష్ట్రం వరుసగా  రెండో ఏడాదీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం. 
 
విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత పారదర్శకంగా పరిపాలన అందిస్తుండటం, సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేస్తుండటం ద్వారా పరిపాలనలో ఏపీ అగ్రగామిగా నిలిచింది.  
 
ఇక రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో మహారాష్ట్ర నిలవగా తెలంగాణ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌(7), మధ్యప్రదేశ్‌ (8), అస్సాం(9), హిమాచల్‌ప్రదేశ్‌ (10), బీహార్‌(11), హర్యానా(12) ఉన్నాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు