కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్జీవీ వ్యూహం పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు.
ఇదిలావుంటే, తుళ్లూరులో కూడా వర్మపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫోటోలను వర్మ గతంలో మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాట రామారావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.