భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం రీసర్వేనే : ప్రతిష్ట మంగైన్

శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:08 IST)
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీ సర్వే కార్యక్రమమే ఏకైక మార్గమని కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్ అన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షా పథకంలో భూముల రీ సర్వే పై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల, గ్రామ సర్వేయర్లకు రెండురోజులపాటు నిర్వహించనున్న డివిజినల్ స్థాయి శిక్షణ తరగతులను మీర్జాపురం జిల్లాపరిషత్‌లో శుక్రవారం సబ్ కలెక్టర్ ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్ మాట్లాతుడూ, రైతులు, ప్రజల భూ సమస్యల పరిష్కారానికి భూముల రీ సర్వే ఏకైక మార్గమన్నారు.  నూజివీడు డివిజన్‌లో భూముల రీ సర్వే పనులు నూరు శాతం విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. 100 సంవత్సరాల తరువాత దేశంలోనే మొదటిసారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూముల రీ సర్వే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. 
 
జిల్లాలో గత రెండు సంవత్సరాల నుండి భూ రికార్డుల స్వఛ్చికరణ కార్యక్రమం కింద భూమి రికార్డులు శుద్దీకరణ చేయడం జరిగిందన్నారు. సదరు భూమి రికార్డులు తీసుకుని సర్వే బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతీ భూమిని డ్రోన్ల లేదా ఆధునిక పరిజ్ఞానమైన శాటిలైట్ల ద్వారా చిత్రాలను తీస్తారన్నారు. భూముల రీ సర్వే గురించి రైతులు, ప్రజలకు ముందుగానే నోటీసులు అందించడం జరిగిందని, సంబంధిత రైతులు, ప్రజల సమక్షంలోనే రెండు సార్లు రీ సర్వే నిర్వహిస్తారన్నారు. 
 
ఆ సమయంలో రైతులు, ప్రజలు అందించిన అభ్యంతరాలను కూడా పరిగణనలోనికి తీసుకోని, ఎటువంటి తేడా లేకుండా భూ సర్వే  జరుగుతుందన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యాధునిక పరిజ్ఞానంతో భూ సర్వే పనులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. నేషనల్ సర్వే శాఖ ఆధ్వర్యంలో సర్వే జరుగుతుందన్నారు. వ్యవసాయ భూములు, గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూముల్లోనూ రీసర్వే కార్యక్రమం చేపడతారన్నారు. 
 
జాయింట్ కుటుంబాలు, విభజన కానీ ఆస్తులకు సంబందించిన భూముల సర్వేలకు సంబందించిన సమస్యలు ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే తొలగుతాయన్నారు. భూముల రీ సర్వే కార్యక్రమం వేగవంతంగా సాగేందుకు సంబంధిత సిబ్బంది పూర్తి స్థాయిలో శిక్షణ పొందవలసి ఉందని, అందుకే అత్యాధునిక టెక్నాలజీ వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు