రోజూ అప్పు చేస్తే గాని, గడవని పరిస్థితుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (13:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోజు అప్పు చేస్తే గాని గడవని పరిస్థితుల్లో ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. అలాగే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న పనులను, సంక్షేమ పథకాలను తనవిగా చెప్పుకొని సీఎం జ‌గ‌న్ చలామణి అవుతున్నార‌ని విమ‌ర్శించారు. విశాఖ బిజెపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు. 
 
విజయవాడ బెంగళూరు హైవే భూసేకరణ దగ్గరనుండి రోడ్డు నిర్మాణం వరకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్నాయి అని ఆరోపించారు. అలాగే రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వని కారణంగా 10 ప్రాజెక్ట్ లు నిలిచిపోయాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనకు కనీసం ప్రణాళిక కూడా లేదని చెప్పారు.
 
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ. రాష్ట్రంలో రైల్వే జోన్ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని అన్నారు. అలాగే ఉత్తరాంధ్రలోని రైల్వేస్టేషన్లను అన్ని వసతులు హంగులతో సుందరంగా తీర్చి దిద్దడం జరుగుతుందని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంక్షేమం  తోనే అభివృద్ధి చేసి ముందుకెళ్తుందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు